చెట్టంతా దేవుల్లే.. | The tree is like the gods

చెట్టంతా దేవుల్లే.. | The tree is like the gods

చెట్టంతా దేవుల్లే.. | The tree is like the gods


చెట్టంతా దేవుల్లే.. | The tree is like the gods
చెట్టంతా దేవుల్లే.. | The tree is like the gods
ఉసిరి చెట్టుకు మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది . బ్రహ్మదేవుని కనుకొనల నుంచి రాలిపడిన ఆనందబాష్పకణం కనుక ఉసిరికి ' అమలకం ' అనే పేరువచ్చింది . ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి , కాండంలో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు , కొమ్మల్లో సూర్యుడు , ఉపశాఖలలో సకల దేవతలూ ఉంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి .


⭐ ఉసిరి చెట్టును సంస్కృతంలో ' ధాత్రీ వృక్షం అంటారు . ధాత్రి అంటే భూమి . ధాత్రి అంటే దాది . భూమి వలె ఆదరించి , దాదివలె పోషించే ఈ ఉసిరి పూజార్హమైనదని పెద్దలు చెబుతున్నారు .

⭐ ఉసిరి , తులసి ఒకేచోట పుట్టాయన్న శివపురాణం ' కథనం ఆధారంగా కార్తిక మాసంలో ఈ రెండింటికీ మన ఆరాధనలో అధిక ప్రాధాన్యం కలిగింది . తులసి మొక్క దగ్గరే ఉసిరి మొక్కను ఉంచి పూజించడం చూడొచ్చు

⭐ ఈ మాసంలో ఉసిరి కాయపై వత్తి వేసి దీపం వెలిగిస్తారు . ఈ దీపం కార్తిక దామోదరుడైన విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి .

⭐ సామాజిక సహజీవనం లక్ష్యంగా ఉద్దేశించిన వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో చేయాలని నియమం ఉంది . ఉసిరి చెట్టుగాలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గుర్తించారు . . . 

⭐ ఉసిరి ఔషధాల నిధి . కార్తిక సోమవారాలు , నాగుల చవితి , ఏకాదశి , పౌర్ణమి రోజుల్లో ఉపవాసం తరువాత చేసే భోజనంలో విధిగా ఉసిరిక పచ్చడి ఉండాలని నియమం . అది జీర్ణాశయంలో ఆమ్లరసాల సమతౌల్యాన్ని కాపాడుతుందని ఆయుర్వేదం చెబుతుంది .