మరణం లేని సూపర్ హీరో ( stan lee )

మరణం లేని సూపర్ హీరో ( stan lee )



స్పైడర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్ , హల్క, థోర్, ఎక్స్ - మేన్ లాంటి సుప్రసిద్ద సూపర్ హీరో పాత్రలను సృష్టించి బాలలకు అభిమాన పాత్రుడైన స్తాన్ లీ ( 95 ) ఇక లేరు . అమెరికాకు చెందిన స్టాన్ లీ  వయోభారంతో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కన్నుమూశారు . 1922 డిసెంబరు 28న జన్మించిన ఆయన అసలు పేరు స్టాన్లీ  మార్టిన్ లీబర్ 17 ఏళ్ల వయసులోనే కామిక్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన స్టాన్ లీ తన జీవిత కాలంలో డజన్ల కొద్దీ సూపర్ హీరోలకు ప్రాణం పోశారు . కామిక్ పుస్తకాల ప్రచురణ సంస్థ మార్వేల్లో ( అప్పటి పేరు టైమ్లీ కామిక్స్ ) రచయితగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తొలుత 1941లో కెప్టెన్ అమెరికా స్టోరీ ' ని రాశారు ఆ తర్వాత నలుగురు సూపర్ హీరోలు ప్రధాన పాత్ర ధారులుగా ' ఫెంటాస్టిక్ ఫోరోను రచించారు . ఆయన కలం నుంచి డేర్ డెవిల్ , డాక్టర్ చేంజ్ బ్లాక్ పాంథర్ , యాంట్ మ్యాన్ లాంటి సూపర్ హీరో పాత్రలు పురుడు పోసుకుని పాఠకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి . సాహసాలు చేయడ మొక్కటే కాదు . .
 హృదయాలను హత్తు కునే భావోద్వేగాలను ప్రదర్శించేలా లీ తన పాత్రలను తీర్చి దిద్దారు . ప్రధానంగా పిల్లల కోసం సృష్టిం చిన ఈ పాత్రలు వారితో పాటు పెద్దల్లో దాగున్న పిల్లల్నీ అలరించడం విశేషం . మార్వెల్లో వివిధ హోదాల్లో పనిచేసి చీఫ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు స్టాన్లీ . సూపర్ హీరోల మల్టీస్టారర్లు ; ఒక్కో చిత్రంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సూపర్ హీరోలు కనిపించడం తెలిసిందే . దీనికి బీజం . వేసింది . స్టాన్ లీనే . ఆయన ఒకేసారి మూడు
నాలుగు సూపర్ హీరో కథలు రాసేవారట . అప్పుడు ఓ కథలోని సూపర్ హీరో మరో కథలోకి అతిథి పాత్రగా వచ్చినట్లు సరదాగా రాసేవారట . అలాంటి కథలకు మంచి ఆదరణ వచ్చిందట . .

 వెండితెరపై కాసుల పంట : 

స్టాన్లీ సృష్టించిన పాత్రల ఆధారంగా మార్వెల్ సంస్థ ఎన్నో టీవీ సిరీస్లు , మరెన్నో చిత్రాలను 
తెరకెక్కించింది . ' స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాలైతే ప్రపంచవ్యాప్తంగా కనుకల వర్షం కురిపిస్తు న్నాయి . స్టాన్లీ సూపర్ హీరో పాత్రలు కలయికతో వచ్చిన ' అవెంజర్స్ ' , ' అవెంజర్స్ ఏజ్ ఆఫ్  ఆల్ట్రాన్ ' , ' అవెంజర్స్ ఇన్ఫినిటీ - వార్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాయి . ఐరన్ మ్యాన్ , కెప్టెన్ అమెరికా ఎక్స్ మెన్ పాత్రలతో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధించాయి . మార్వెల్ నిర్మించే చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం స్టన్ లీకి సరదా . తోటమాలి , డెలివరీ బాయ్ లాంటి పాత్రల్లో ఆయన తళుక్కున మెరిశారు ఓ తరం పిల్లలందరినీ ఊహల్లో సూపర్ హీరోలుగా మార్చేసి అందమైన బాల్యాన్ని కానుకగా ఇచ్చారు స్టాన్ లీ . తాను లోకాన్ని వీడినా సూపర్ హీరోల రూపంలో అభిమా నుల హృదయాల్లో చిరంజీవిగానే ఉంటారు .