చరణ్ తారక్ రెడీనా ! ( RRR Movie shooting started. Charan tharak ready ! )

ఎన్టీఆర్ , రామ్చరణ్ కథానాయకులుగా ఎస్ . ఎస్ . రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది . డి . వి . వి . దానయ్య నిర్మాత . ఈనెల 11న ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది . ఇప్పుడు షూటింగ్ శ్రీకారం చుట్టేశారు . హైదరాబాద్ శివార్లలో ఎన్టీఆర్ , చరణ్లపై భారీ పోరాట ఘట్టంతో యాక్షన్ లోకి దిగిపోయారు రాజమౌళి . ఈ సందర్భంగా ట్విటర్లో ఓ ఫొటోని విడుదల చేశారు . చరణ్ రెడీనా . . తారక్ రెడీనా . . క్లాప్ . . . యాక్షన్ అంటూ రాజమౌళి సూచనలు ఇస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది . ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా ప్రాధాన్యం ఉంది . అందుకే ముందుగా అవన్నీ పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నారు . కథానాయికలుగా కీర్తి సురేష్ , కైరా అడ్వాణీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయక ఛాయలు కనిపిస్తాయని సమాచారం . ఎం . ఎం . కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు . బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు .
' బాహుబలి ' రెండు చిత్రాల్నీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పూర్తి చేశారు రాజమౌళి . అయినప్పటికీ ' బాహుబలి ' తొలి భాగానికి సంబం ధించిన ఓ సన్నివేశం లీకైపోయింది . ఇక మీదట అలాంటి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదన్న నిర్ణయానికివచ్చారు రాజమౌళి . చిత్రీకరణ జరిగేచోట చిత్రబృందాన్ని మినహా ఇంకెవ్వరినీ అనుమతించడం లేదు . బృందంలోని ప్రతి సభ్యుడికీ ఓ గుర్తింపు కార్డు ఉంటుంది . అది ఉన్నవాళ్లనే సెట్లోకి అనుమతిస్తున్నారు . ' ఆర్ ఆర్ ఆర్ ' సెట్లో సెల్ ఫోన్లకు అనుమతి లేదు . రాజమౌళి కూడా వాకీటాకీనే వాడుతున్నారు .