రోబో పోలీస్ ( robo police )
సింగపూర్లో ఆసియాన్ సదస్సు సందర్భంగా సన్ టెక్ సమావేశకేంద్రం ఆవరణలో తిరుగాడుతున్న రోబో పోలీస్ ఇది . నవంబరు 11 నుంచి ఐదురోజులపాటు నిర్వహించే ఆసియాన్ సదస్సులో వీవీఐపీల రక్షణకు 5000 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటుచేశారు . సంఘ విద్రోహక శక్తులను పట్టుకునేందుకు నేరస్తుల వివరాలతో కూడిన రోబోలను సైతం రంగంలోకి దింపారు . అవాంఛనీయ వ్యక్తులను పసిగట్టిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడం ఈ రోబోల పని .
Comments