ఆర్ ఆర్ ఆర్ మొదలైంది ( R R R Movie Shooting Started, Rajamouli next film started )
బాహుబలి ' చిత్రాలతో ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకో నేలా చేశారు . ప్రముఖ దర్శకుడు ఎస్ . ఎస్ . రాజమౌళి . ఆ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అపూర్వ విజయం సాధించాయి . భారీ స్థాయి వసూళ్లు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచాయి . ' బాహుబలి ' చిత్రాలతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన రాజమౌళి తదుపరి ఎలాంటి సినిమా చేయబోతున్నారు ? ఎవరితో చేయబోతున్నారు ? అనే విషయా లపై చర్చ మొదలైంది . ప్రేక్షకుల్లో నెలకొన్న ఆ ఆసక్తి , ఆత్రుతకు తెరదించుతూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు . సాధార ణంగా రాజమౌళి సినిమా అంటేనే అంచ నాలు ఓ స్థాయిలో ఉంటాయి . ఇక అందులో అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలసి నటిస్తున్నారనేసరికి ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి . రామారావు రామ్ చరణ్ రాజమౌళి ( ఆర్ ఆర్ ఆర్ ) అనే అర్థం వచ్చేలా వర్కింగ్ టైటిలని నిర్ణయించారు . ఈ భారీ చిత్రాన్ని 11వ నెల 11వ తేదీ 11 గంటలకి ప్రారంభిస్తామని ముందుగానే ప్రక టించారు . ఆ మేరకు ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా చిత్రం ప్రారంభమైంది .
డి . వి . వి . ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై
డి .వి .వి .దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథా నాయకుడు చిరంజీవి క్లాప్ నిచ్చారు .వి .వి .వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు .కె .రాఘ వేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించి , స్క్రిప్టుని చిత్రబృందానికి అందజేశారు .నిర్మాత మాట్లాడుతూ తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయిలో చాటిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండడం ఓ కలలా ఉంది .మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకొనేలా అత్యున్నత సాంకే తిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాం .రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకు లుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి అభిమా నులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారని తెలుసు .అందుకు తగ్గట్టుగానే చిత్రం ఉంటుంది .ఈ నెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది .ప్రత్యేకంగా తీర్చి దిద్దిన సెట్లో కథానాయకుల నేపథ్యంలో రెండు వారాల పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం .ఈ చిత్రంలోని ఇతర నటుల గురించి త్వరలోనే ప్రక టిస్తామన్నారు .ఈ చిత్రానికి కథ : విజయేం ద్రప్రసాద్ , మాటలు : సాయిమాధవ్ బుర్రా , కార్కి , కాస్ట్యూమ్ డిజైనర్ : రమా రాజమౌళి , కూర్పు : శ్రీకర్ ప్రసాద్ , వి .ఎఫ్ .ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ , సంగీతం : ఎం .ఎం .కీరవాణి , ప్రొడక్షన్ డిజైనర్ : సాబుసిరిల్ , ఛాయాగ్రహణం : కె .కె .సెంథిల్ కుమార్ , సమర్పణ : డి , పార్వతి .
Comments