మళ్ళీ మేకప్ వేసుకుంటున్నా రా ? ( Pawankalyan sai sharam tej varun tej new movie )
పవన్ కల్యాణ్ దృష్టి పూర్తిగా రాజకీయాలపై ఉంది . ఎక్కువగా జనం మధ్య తిరుగుతున్నారు . ' మీ కోసమే సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చా " అని అభిమానుల్ని ఉత్సాహ పరుస్తున్నారు . అయితే పవన్ కల్యాణ్ దృష్టి మళ్లీ సినిమాల పై పడిందని సమాచారం . ఆయన త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని , ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ కోసం ఓ కథ . సిద్ధం చేయిస్తున్నారట . బాబీ , డాలీలలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది . సర్దార్ గబ్బర్ సింగ్ కి బాబినే దర్శకుడు . ' గోపాల గోపాల ' , ' కాటమరాయుడు ' చిత్రాల్ని డాలీ రూపొందించారు . ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి మరోసారి అవకాశం దక్కనుంది .
ఇందులో పవన్ కాకుండా మరో మెగా కథా నాయకుడు కూడా కనిపిస్తారని తెలుస్తోంది . సాయిధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ ల్లో ఒకరు పవన్ తో పాటు తెరపై కనిపించే అవకాశాలున్నాయట . పవన్ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుందని , కథకు ఆయన పాత్ర కీలకమని సమాచారం . ఈ కథలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తారట . 2019 ఎన్నికలలో పోటీ చేస్తున్న పవన్ కి ఊతమివ్వాలన్న సంక ల్పంతోనే ఈ కథ తయారు చేశారని చెబుతున్నారు .