దిల్లీ పాలన మనకెందుకు | Delhi rule for us ! | Excellent speech mp kavitha
దిల్లీ పాలన మనకెందుకు | Delhi rule for us !
దిల్లీ పాలన మనకెందుకు | Delhi rule for us
త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణకు దిల్లీ పాలన అవసరం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు . మహాకూటమి నాయకులకు సీట్ల కేటాయింపు సీల్డు కవర్లు కూడా దిల్లీ నుంచే వచ్చయని ఆక్షేపించారు . జగిత్యాల జిల్లా రాయికల్ జగిత్యాల మండలాల్లో బుధవారం ఎంపీ కవిత రోడ్షో నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమి నేతలు ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు . జీవన్ రెడ్డి , ఎల్ రమణలు 30 ఏళ్లుగా ఒకర్నొకరు తిట్టుకున్నారని , ప్రస్తుతం అధికారంకోసం కృష్ణా పుష్కరాలలో తప్పిపోయిన కవల పిల్లల్లా ప్రేమలు ఒలకబోసుకుంటున్నారని ఎద్దేవాచేశారు . 60 ఏళ్లుగా జరగని అభివృద్దిని నాలుగేళ్లలో చేసి చూపిన కేసీఆర్ ను గద్దె దించుతామని కూటమి నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు . తెరాస జగిత్యాల నుంచి జైత్రయాత్ర మొదలుపెట్టి 100 సీట్లు సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు .