సెట్లోనే ఇల్లు. మరో కొత్త బాషా?

ss rajamouli, rajamouli new movie updates, rajamouli upcominf movies,


 సెట్లోనే ఇల్లు

ఎస్ . ఎస్ . రాజమౌళి ధ్యాస ఎప్పుడూ సినిమా పైనే . అందుకే ఆయన దర్శకధీరుడయ్యారు . ఆయనకు సినిమా తప్ప మరో వ్యాపకం తెలీదాయె . కుటుంబ సభ్యులు కూడా తనతో , తన సినిమాలతో ప్రయాణం చేయడం వల్ల సినీ జీవితం , వ్యక్తిగత జీవితం మధ్య ఉన్న రేఖ కూడా చెరిగిపోయింది . ఇప్పుడాయన మరో అడుగు ముందుకేశారు . సెట్లోనే ఇల్లు కట్టేశారు . ప్రస్తుతం రాజమౌళి ' ఆర్ ఆర్ ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు . హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ సెట్ ను తీర్చిదిదారు . ఈ సెట్లోనే దాదాపు సగం సినిమాను చిత్రీకరించనున్నారు . ఎక్కువ రోజులు ఈ సెట్ లోనే గడపాలి కాబట్టి అక్కడే ఓ మండువా ఇల్లు కూడా కట్టించే శారు . దాన్ని రాజమౌళి తన ఆఫీసులా వాడుకోబోతున్నారని తెలుస్తోంది . ఓ గది ఎడిటింగ్ కోసం , మరో గది కాస్ట్యూమ్స్ కోసం ఉపయోగించనున్నారట . ఇంకొన్నిగదులు సెట్ కి సంబంధించిన పరికరాలు ,  ప్రోపర్టీస్ కోసం కేటాయించారు . కథానాయకులు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కోసం కూడా మరో రెండు గదులు ఉన్నాయట . తమ పాత్రలకు సంబంధించిన కసరతుల కోసం ఈ గదుల్ని ఉపయోగించుకోనున్నారు . సంగీత చర్చలు కూడా ఇక్కడే సాగనున్నాయి .


మరో కొత్త భాష ?

' బాహుబలి ' కోసం కిలికి భాష సృష్టించారు రాజమౌళి . ఆ భాష అందులోని పదాలు భలే గమ్మత్తుగా ఉంటాయి . ఇప్పుడు ' ఆర్ ఆర్ ఆర్ కోసం కూడా అలాంటి కొత్త భాషని కని పెట్టే పనిలో ఉన్నారు . కథ ప్రకారం అటవీ . నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలుంటాయని తెలుస్తోంది . ఆ సన్నివేశాల కోసం ఈ భాషని వాడతారని సమాచారం . ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఈనెల 19 నుంచి మొదలుకానుంది . తొలుత యాక్షన్ దృశ్యాల్ని తెరకెక్కిస్తారు . ముగ్గురు కథానాయికలకు చోటుంది . ఈ చిత్రానికి ' రామ రావణ రాజ్యం ' అనే పేరు పరిశీలనలో ఉంది .


Comments