జేమ్స్ బాండ్ కి కష్టాలు ఎందుకో తెలుసా?


అభిమాన తారలను ఆటోగ్రాఫ్లు అడిగే రోజులు కవివి. ఇప్పుడంతా సెల్ఫీల మీదే మేజు. అభిమాన నటుడు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్ని సార్లు ఈ విషయంలో అభిమానుల అత్యుత్సాహం తారలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అన్నట్లు జేమ్స్ బాండుకు ఈ పరిస్థితి తప్పడం లేదట.
బాండ్ పాత్రలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ క్రేగ్ సెల్ఫీ కష్టాల గురించి ఏకరువు పెట్టారు. నాకు రాత్రి పూట సరదాగా పబ్బుకు వెళ్లడం అలావాటు. అక్కడ సన్నిహితులతో ప్రశాంతంగా గడపాలనుకుంటాను. కానీ అభిమానులు సెల్ఫీల కోసం చుట్టుముడుతుంటారు. సెల్ఫోన్లు రావటం వల్లే పరిస్థితి ఇలా తయారయింది. పగలంతా ఆటోగ్రాఫలు ఇవ్వటానికి, ఫొటోల కోసం ఫోజులివ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ రాత్రి కూడా సెల్ఫీల కోసం అడుగుతుంటే నరకంలా అనిపిస్తుందన్నారు క్రేగ్. ఇక అనుమతి లేకుండా తారలను ఫొటోలు తీసేవారున్నారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ  నేను ఒక మాములు మనిషిలా బతకాలేకపోతున్నాను. అందుకు కారణం ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉండటమే అని చెప్పారు క్రేగ్.

Comments

Popular Posts