మెదడు లాంటి సూపర్ కంప్యూటర్ Super computer like the brain
మానవ మెదడు ఓ అద్భుతం . అమోఘమైన మేధస్సుతో పుడమిని శాసిస్తున్న ఈ అవయవం ప్రకృతి ప్రసాదితం . అదేరీతిలో పనిచేసే అతి పెద్ద కంప్యూటర్లు శాస్త్రవేత్తలు సిద్దం చేశారు . తొలిసా రిగా దాన్ని స్విచ్చాన్ చేశారు . ప్రపంచంలోనే అతి పెదదైన ఈ కంప్యూటర్ సాయంతో మెదడు పనితీ రుకు సంబంధించిన గుట్టుమట్లను వెలుగులోకి తెచ్చి , నాడీ సంబంధ వ్యాధులకు కొత్త ఔషధాలను కనుగొనవచ్చు . కొత్తతరం రోబోల తయారీకి ఇది వీలు కల్పిస్తుంది .
తిరుగులేని సామర్థ్యం
స్పీన్నేకార్లో మిలియన్ ప్రాసెసర్ కోర్ సామర్థ్యం ఉంది . ఇది సెకనుకు 200 మిలియన్ మిలి యన్ కు పైగా చర్యలను చేపట్టగలదు . ఇందులోని ఒక్కో చిప్లో 10 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి . ఈ యంత్రం అప్పటికప్పుడు ( రియల్ టైమ్ ) భారీస్థాయిలో జీవపరమైన న్యూరాన్లను అనుకరించగలదు . జీవపరమైన న్యూరాన్లవి నాడీ వ్యవస్థలోని ప్రాథమికస్థాయి నాడీ కణాలు . విద్యుత్ రసాయన శక్తితో కూడిన ప్రకంపనల ( స్పైక్లు ) ను వెలువరించడం ద్వారా ఇవి సమాచారాన్ని చేరవేస్తాయి .
# సరిగ్గా ఇలాంటి ప్రకంపనలను ఒక యంత్రంలో అనుకరించేందుకు భారీ స్థాయి కంప్యూటర్ వ్యవస్థ లను ఉప యోగిస్తారు . దీన్ని న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్గా పేర్కొంటారు
# స్పిన్నేకర్ కూడా ఇలాంటిదే . అయితే చాలా ప్రత్యేకమైంది . సంప్రదాయ కంప్యూటర్లు ఒక ప్రామాణిక నెట్వర్క్ ద్వారా నిర్దిష్టంగా ఒక చోటు నుంచి మరో చోటుకు భారీ స్థాయిలో సమాచా రాన్ని చేరవేస్తాయి . అందుకు భిన్నంగా స్పిన్నేకర్ . మెదడులో భారీగా ఉన్న సమాంతర కమ్యూనికే షన్ వ్యవస్థను అనుకరిస్తుంది . వందల కోట్ల సంఖ్యలో చిన్నపాటి సమాచారాలను ఏకకాలంలో వేలాది గమ్యస్థానాలకు చేరవేస్తుంది .
# రియల్ టైంలో మెదడును అనుకరించేలా మోడలింగ్ రూపకల్పనకు ఒకే కంప్యూటర్లో పది లక్షల కోర్లను ఏర్పాటు చేయాలనుకున్న శాస్త్రవే త్తలు ఇప్పుడు దాన్ని సాధించారు . రియల్ టైమ్లో వందకోట్ల జీవపరమైన న్యూరాన్ల వరకూ మోడల్ చేయాలన్నది వారి తదుపరి లక్ష్యం . వంద కోట్ల న్యూరాన్లు అంటే . . మానవ మెదడులో ఒక్క శాతం మాత్రమే . మనిషి మెదడులో ఇంచుమించు 10వేల కోట్ల న్యూరాన్లు ఉంటాయి . ఈ కణాలన్నీ భారీగా అనుసంధానమై ఉంటాయి . ఎలుక మెద డులో దాదాపు 10 కోట్ల న్యూరాన్లు ఉంటాయి .
బోలెడు ప్రయోజనాలు
స్పిన్నేకర్ ద్వారా మానవ మెదడు పనితీరును మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు .భారీస్థాయిలో అప్ప టికప్పుడు సిమ్యులేషన్లను నిర్వ హించడం ద్వారా ఈ కసరత్తును అది చేపడుతుంది .
# ఉదాహరణకు మెదడులోని వెలు పలి పొర అయిన కార్టెక్స్ లో 80వేల న్యూరాన్లతో కూడిన భాగాన్ని ఇది అనుకరించగ .లదు .జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే సమాచారాన్ని మెదడు లోని ఈ భాగం ప్రాసెస్ చేస్తుంది .బాసల్ గాంగ్లియా అనే ప్రాంతాన్ని కూడా స్పిన్నేకర్ సిమ్యులేట్ చేయగలదు .
పార్కిన్సన్స్ వ్యాధిలో ప్రభావితమయ్యేది ఈ ప్రదేశమే .
# స్సోమ్ని బోట్ ' అనే ఓ రోబోను నియంత్రించడానికి స్పిన్నేకర్ శక్తిని పరిశోధకులు ఉపయోగించారు . దృశ్యసమాచారాన్ని
అప్పటికప్పుడు విశ్లేషించుకోవడంలో రోబోకు ఇది ఉపయోగపడింది . సంచార రోబోల్లో భారీ న్యూరల్ నెట్వర్క్లను డిజైన్ చేయడానికీ స్పీన్నేకర్ ఉపయోగపడు తుంది . అలాంటి రోబోలు శక్తిని మితంగా వాడుకుంటూ నడవడం , మాట్లాడటం , ఎటుపడితే అటు కదలడం వంటివి చేయగ లుగుతాయి .
ఎక్కడ ?
స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ( స్పిన్నేకర్ ) అనే యంత్రాన్ని బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో నిర్మించారు . దీన్ని సాకారం చేయడానికి పరిశోధకులు తీవ్ర స్థాయిలో శ్రమించారు . దీని డిజైన్ కు 20 ఏళ్లు , నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది . 1.5 కోట్ల పౌండ్లను వెచ్చించారు .