నిత్యం రద్దీగా ఉండే మైండ్ స్పేస్ కూడలిలో ట్రాఫిక్ కష్టాలు ఇక తిరినట్టే
నిత్యం రద్దీగా ఉండే మైండ్ స్పేస్ కూడలిలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులకు ఇక ఉపశమనం లభించినట్లేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ . కే . జోషి పేర్కొన్నారు . ఐటీ కారిడార్లో రహదారి వ్యవస్థను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు మెరుగ్గా తీర్చిదిద్దారని , నిర్దేశిత గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేశారని ప్రశంసించారు . హైదరాబాద్ హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ కూడలిలో రాడిసన్ హోటల్ - ఇనార్చి టీమాల్ రోడ్డు మార్గంలో నిర్మించిన నాలుగు లైన్ల పైవంతెనను శుక్రవారం ఆయన ప్రారంభించారు . రూ . 25 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఎస్సార్డీపీ ( వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం ) ప్రాజెక్టులో భాగంగా వంతెన నిర్మిత మైందని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఎం . దానకిషోర్ తెలిపారు . ముఖ్య ఇంజినీరు శ్రీధర్ మాట్లా డుతూ . .
రూ . 48 . 06 కోట్లతో 830 మీటర్ల ఈ పైవంతెనను అందుబాటులోకి తెచ్చామన్నారు . జనవరిలో ఎల్బీనగర్ కూడలి , రాజీవ్ గాంధీ కూడలి
( జేఎన్టీయూ హెచ్ రోడ్డు ) పైవంతెనలు - ప్రారంభమవుతాయని చెప్పారు .
Comments