జనవరి లొనే మొదలు | nagarjuna movie start in January | manmadhudu 2

జనవరి లొనే మొదలు | nagarjuna movie start in January

నాగార్జున ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు . హిందీలో ' బ్రహ్మాస్త్రతో పాటు తమిళంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తు న్నారు . ఆ చిత్రాల తర్వాతే తెలుగులో తన కొత్త సినిమాని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది . నాగార్జున కోసం రాహుల్ రవీంద్రన్ ఓ కథని సిద్దం చేశారు . చి . ల . సౌ ' తో వినోదాన్ని పంచిన ఆయన పనితీరు నాగార్జునకి బాగా నచ్చింది . దాంతో ఆ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ విని , వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నాగ్ . ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమాను దృష్టిలో ఉంచుకుని మన్మథుడు 2 పేరును కూడా రిజిస్టర్ చేయించారు . వచ్చే జనవరి నుంచే చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం . కథ రీత్యానే ' మన్మథుడు 2 ' పేరును రిజిస్టర్ చేయించామని , పక్కాగా పేరుని ఇంకా ఖరారు చేయలేదని నాగార్జున గతంలో చెప్పారు . ' సోగ్గాడే చిన్నినాయనా ' కి సీక్వెల్ తో పాటు నాగ్ కోసం మరిన్ని కథలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది .