అర్జున్ ముసుగు వెనుక రహస్యం | Arjun kapoor cap secret
అర్జున్ ముసుగు వెనుక రహస్యం
బాలీవుడ్ . కథానాయకుడు అర్జున్ కపూర్ ఈ మధ్య మొహానికి మాస్క్ , తలకు టోపీ ధరించి చాలా రహస్యంగా తిరుగుతున్నాడు . అది ఎందుకా అని బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారట ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది . అర్జున్ తాపత్రయం తన గుండును దాచుకోవడానికేనట . మరి గుండెందుకు కొట్టించుకున్నాడంటారా ? సినిమా కోసం . ప్రస్తుతం అర్జున్ ' పానిపట్ చిత్రంలో నటిస్తున్నాడు . పానిపట్ యుద్ధం నేపథ్యంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్య చిత్రమిది . అశుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తున్నారు . మారాఠా యోధుడు సదాశివ్ రావ్ భవ్ పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు అతని రెండో భార్య పార్వతీ బాయిగా కృతిసనన్ నటిస్తోంది . మరో కీలక పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు . ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో అర్జున్ గుండుతో మీసాలు లేకుండా కనిపించాల్సి ఉందట . అందుకు సాధారణంగా ప్రొ స్థిటిక్ మేకపను ఆశ్రయిస్తుంటారు . కానీ అర్జున్ సహజత్వం కోసం నిజంగానే గుండు గీయించుకున్నాడట . అంతేకాదు మీసాలు సహా మొహం పై ఒక్క వెంట్రుక కూడా లేకుండా సిద్దమయ్యాడట . ఆ గేటపను రహస్యంగా ఉంచడం కోసమే ఇలా వేసుకుంటున్నాడని సమాచారం .