221 మీటర్ల ఎత్తయిన కంచు విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు | The world's largest statue planing in Ayodhya

221 మీటర్ల ఎత్తయిన కంచు విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు | The world's largest statue planing in Ayodhya
221 మీటర్ల ఎత్తయిన కంచు విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు | The world's largest statue planing in Ayodhya

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తున్న ఓ నమూనా

 అయోధ్య రాముడు 

• 221 మీటర్ల ఎత్తయిన కంచు విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు • 

• నమూనాలు పరిశీలించిన సీఎం ఆదిత్యనాథ్ 

 శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది . ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం రాత్రి ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన ఆయిదు సంస్థల నమూనాల్ని పరిశీలించారు . ఇటీవల గుజరాత్లో ఆవిష్కరించిన ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం 
( వేదికతో కలిపి 182 మీటర్లు) కన్నా ఎత్తుగా శ్రీరాముడి విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు యూపీ ముఖ్యకార్యదర్శి అవినాష్ అవసి తెలిపారు ' మర్యాద పురుషోత్తం ' పేరిట ఆయోధ్యలో నిర్మించనున్న ఈ భారీ కంచు విగ్రహం వేదికతో కలిపి మొత్తం ఎత్తు 221 మీటర్లు ఉండనుంది . విగ్రహ వేదిక 50 మీటర్ల ఎత్తున నిర్మించనున్నారు . 20 మీటర్ల ఎత్తు గల గొడుగు , తల వెనుక చక్రం విల్లంబులతో కలిపి విగ్రహం ఎత్తు 151 మీటర్లు ఉంటుంది . అయోధ్యలో దీపావళి సంబరాల సందర్భంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన గురించి సీఎం ప్రస్తావించిన సంగతి తెలిసిందే . వేదిక లోపల అధునాతన మ్యూజియం కొలువుదీరనుంది . ఇక్ష్వాకుల చరిత్ర నుంచి రామజన్మభూమి వరకు మొత్తం శ్రీరామచరిత్ర ఘట్టాల్ని ఇందులో ప్రదర్శనకు ఉంచనున్నారు .