2.O movie release updates
2.O movie release updates
సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ మరో ఎత్తు . ప్రీ క్లైమాక్స్ వరకూ ఫర్లేదనిపించినా క్లైమాక్స్ అదిరిపోతే సూపర్ సినిమా అనేస్తారు ప్రేక్షకులు . బాక్సాఫీసు లెక్కల్లో డిసెంబరు కూడా క్లైమాక్స్ లాంటిదే . ఏడాది మొత్తం వచ్చిన చిత్రాలు ఓ లెక్క ఆఖరి నెలలో రాబోయే చిత్రాలు ఇంకో లెక్క డిసెంబరులో వచ్చే చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో విజయంసాధిస్తే ఆ ఏడాదిని ఘనంగా ముగించి అదే ఉత్సాహంతో కొత్త ఏడాదికి సిద్ధమవుతోంది . చిత్రసీమ . అందుకే నెలలో ఏయే చిత్రాలు పలకరించబోతు న్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది . ఈ డిసెంబరులో బాలీవుడ్ నుంచి మూడు ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి . వాటికి తోడు మరో రెండు ప్రాంతీయ చిత్రాలు , ఒక హాలీవుడ్ చిత్రం హిందీలోనూ విడుదలకాబో తున్నాయి . వాటి సంగతులివీ .
ఈసారి నవంబరు 29 నుంచే చిత్రసీమలో క్లైమాక్స్ మొదలైపోతుంది . ఆరోజే ' 2 . ఓ ' . వచ్చేస్తోంది మరి . ' రోబో ' కు సీక్వెల్ గా రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన ' 2 . ఓ ' తమిళం , తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది . ఈ చిత్రానికి బాలీవుడ్ తో మరో గట్టి సంబంధముంది . బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు . రజనీకాంత్ పోషించిన చిట్టి పాత్రతో పాటు అక్షయ్ కుమార్ చేసిన క్రోమ్యాన్ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతుందని తెలుస్తోంది . ఆ రెండు పాత్రల గెటప్పులకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన లుక్కులు , ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి . సాధారణంగా రజనీ చిత్రాలకు దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది . దానికి తోడు అక్షయ్ తొలిసారి ప్రతినాయకుడిగా కనిపించనుండటంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది . అమీజాక్సన్ నాయికగా కనిపించనుంది .