ఉగ్ర దేశాలను బహిష్కరిద్దాం | Let's expel the fiery nations

ఉగ్ర దేశాలను బహిష్కరిద్దాం | Let's expel the fiery nations | cricket news in telugu | mahatma media | kbr facts | pedda dhadgi



ఉగ్ర దేశాలను బహిష్కరిద్దాం | Let's expel the fiery nations | cricket news in telugu | mahatma media | kbr facts | pedda dhadgi


వచ్చే ప్రపంచకప్ లో  పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాలా వద్దా అన్న దానిపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ ( సీఓఏ ) తన నిర్ణయాన్ని వాయిదా వేసింది . ఐతే ఉగ్రవాదానికి అడ్డాగా మారిన దేశాలతో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని సభ్య దేశాలను కోరాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది . ప్రపంచకప్ భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరింది . ఈ మేరకు ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ , ముఖ్య కార్యనిర్వహణ అధికారి డేవ్ రిచర్డ్సన్ , ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్ స్టీవ్ ఎల్వరీ , ఈసీబీ చైర్మన్ కోలిన్ గ్రేషీలకు సీఓఏ తరపున . . బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి లేఖ పంపాడు . పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆటగాళ్లు , అధికారులు , అభిమానుల భద్రతపై బీసీసీఐ ఆందోళనతో ఉన్నట్లు లేఖలో జోహ్రి తెలిపాడు .  బ్రిటన్ సహా దాదాపు క్రికెట్ దేశాలన్నీ ఉగ్రదాడిని ఖండించాయి . భారత్ కు సంఘీభావాన్ని ప్రకటించాయి . ఉగ్రవాదం పుట్టుకకు కారణమవుతున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని క్రికెట్ దేశాలను బీసీసీఐ అర్ధిస్తోంది ” అని లేఖలో పేర్కొన్నాడు . పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్ పీఎఫ్ జవాన్ల మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో బోర్డు ఈ లేఖ రాసింది . పాకిస్తాన్ తో ప్రపంచకప్ మ్యాచ్ (జూన్ 16) బహిష్కరించాలన్న డిమాండ్లు నేపథ్యంలో వినోద్ రాయ్
నేతృత్వం సీఓఏ శుక్రవారం సమావేశమైంది. "జూన్ 16 చాలా దూరంలో ఉంది. ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ మ్యాచ్ పై నిర్ణయం తీసుకుంటాం "అని వినోద్ రాయ్ చెప్పారు. ఈ విషయంపై ఆటగాళ్లను సంప్రదించారా అని అడగగా. . రాయ్ లేదని, బదులిచ్చాడు. ఈ నెల 26 న ఐసీసీ సమావేశంలో లేవనెత్తుతామని సూచించారు. పాక్లో మ్యాచ్ కు మూడు నెలల సమయం ఉంది, ప్రభుత్వం నిర్ణయం కట్టుబడి ఉంటుందని అతడు చెప్పాడు. హర్భజన్ సింగ్, మహ్మద్ అజాహరుద్దీన్, సౌరభ్ గంగూలీ వంటి వారు పాక్ తో ప్రపంచకప్ మ్యాచ్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.


Popular Posts