హర్మన్ ప్రీత్ దూకుడు ( Super performance by cricketer harmanpreeth )


అది 2016 వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియాతో భారత్ కు సెమీఫైనల్ మహిళల క్రికెట్లో కంగారూ జట్టు తిరుగులేని శక్తి , భారత్ బలం ప్రకారం చూస్తే ఆ మ్యాచ్లో గెలుస్తుందన్న ఆశలు పెద్దగా లేవు. 42 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 25 ఓవర్లకు మూడు జీలక వికెట్లు కోల్పోయి 101 పరుగులే చేసింది . ఆ స్థితిలో భారత్ 200 చేస్తే ఎక్కువనుకు న్నారు . కానీ భారత్ ఏకంగా 281 పరుగుల అనూహ్య స్కోరు సాధించింది . అందుక్కారణం హర్మన్ ప్రీత్  భీకరమైన ఆస్ట్రేలియా బౌలింగిను తుత్తునియలు చేస్తూ ఆ రోజు ఆమె ఆడిన ఇన్నింగ్ చరిత్రాత్మక 115 బంతుల్లో 171. పరుగులతో అజేయంగా నిలిచింది హర్మన్ ఆ రోజు ఫరుషుల క్రికెట్లోని వేగం .  దూకుడు . మజా అన్నీ అమ్మాయిల ఆటలోనూ ఉన్నాయని చాటిన ఇన్నింగ్స్ అది : 1983 ప్రపంచకప్ లో జిమ్ బామ్బ్యే తో కపిల్ దేవ్ ఆడిన చారిత్రక 175 పరుగుల ఇన్నిం గోతో పోల్చారు క్రికెట్ విశ్లేషకులు ఆమె శతకాన్ని ఎప్పుడూ పురుషుల ఆటనే ఆసక్తిగా చూస్తే క్రికెట్ అభిమా నులు . ఆ ఇన్నింగ్స్ తర్వాత హర్మన్ ఆడుతుంటే అంతే ఆసక్తితో టీవీలకు అతుక్కుపోతున్నాడు . ఆమె బ్యాటింగ్లోని దూకుడు , ఆందం అందుక్కారణం . శుక్రవారం కూడా హర్మన్ బ్యాటింగ్ చూసిన వాళ్లు ముగ్గులయ్యే ఉంటారు . క్రీజు వదిలి బయటికి వచ్చి బంతిని అందుకునే తీరు . . లాగి పెట్టి గోల్స్ షాట్ల తరహాలో లాంగాన్ , లాంగాఫీల్లో ఆమె సిక్సర్లు బాదే వైనం - మోకాలిపై కూర్చుని మీడవికెట్లో కొట్టే షాట్ల విధానం . . ఇలా హర్మన్ బ్యాటింగ్లో ప్రత్యేకతలెన్నో అవసరానికి తగ్గట్లు గేర్లు - మార్చే  హర్మన్ . ఒకసారి ఊపందుకుంటే ఆపడం కష్టమే ! శుక్రవారం ఆ విషయం కివీస్ కు బాగా తెలిసొచ్చింది . ఆమె ఇన్నింగ్స్ మిగతా జట్లకూ హెచ్చరికే మహిళల టీ20ల్లో సెంచరీలు అరుదు . భారత్ తరఫున తొలి సెంచరీ నమోదైంది  ఇప్పుడే . ఆలాంటి ఆరుదైన ఘనత సాధించినపుడు కూడా హర్మన్ పెద్దగా ఉద్వేగం లేదు . ఇదంతా మామూలే అన్నట్లుగా సాధారణంగా కనిపించిందమే! ఇది ఆమె పరిణతికి నిదర్శనం టోర్నీలో హరన్ దూకుడు ఇలాగే కొనసాగితే ప్రపంచకప్ పై భారత్ చేయి పడ్డట్లే!

Popular Posts