ఆనందంగా ఉండలి అంటే ఎం చేయాలి ? Should i be happy

How to become happy, happy ga undalante em cheyali, happy images,


ఆనందంగా ఉండేందుకు ఎన్నో చేస్తుంటారు కదా ... వాటిలో ఈ అంశాలు కూడా చేర్చుకుని చూడండి అని చెబుతున్నారు నిపుణులు . ఇంతకీ అవేంటంటే . . . 

*  మీకోసం మీరు కచ్చితంగా కొంత సమయం కేటాయించుకోవాలి . ముఖ్యంగా నచ్చిన పని చేసేందుకు ప్రయత్నించాలి . వ్యక్తిగత ఆరోగ్యం , అందం , ఆహార్యం . . . ఇలా అన్నింటిపై దృష్టి పెట్టాలి .

 *  కొన్నిసార్లు చిన్నచిన్న పనులే ఆనందాన్ని కలిగిస్తాయి . తీరిక ఉన్నప్పుడల్లా చేసే ఓ సేవ , ఒకప్పటి స్నేహితులతో మాట్లాడటం , సహో ద్యోగులతో కలిసి కప్పు కాఫీ తాగడం . . . వంటివన్నీ అప్పటికప్పుడు ఉన్న ఒత్తిడిని దూరం చేస్తాయి . సంతోషాన్ని అందిస్తాయి .

 * మీకు ఎదురయ్యే ఉద్వేగాలు , ఆలోచనలు కుదిరినప్పుడల్లా ఓ చోట రాయాలి . ఉద్వేగాలు , ప్రతికూల ఆలోచనలు అయితే ఎలా అధిగ మించాలనేది చూసుకోవాలి . ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు కాకపో యినా క్రమంగా మార్పు కనిపిస్తుంది .

 * ఏ పనీ లేదా . . . పుస్తకపఠనం పై దృష్టి పెట్టండి . కనీసం అరగంట చదివినా చాలు . . . మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న గందరగోళ ఆలోచనలన్నీ దూరం అవుతాయి . ఒత్తిడి కూడా పోయి , మానసిక సాంత్వన కలుగుతుంది . ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది .

*  నచ్చిన పని చేసినా ఆనందం సొంతమవుతుంది . అది వంటల్లో ప్రయోగం కావచ్చు , ఇల్లు సర్దడం కావచ్చు . . . మరో పని కావచ్చు . ఒక్కరే కూర్చుని టీవీ చూసినా సరే . . . . ఏదో ఒకటి చేయండి .

* ఒకటి రెండు కేజీల బరువు తగ్గినా , పనిలో ఏదయినా విజయం సాధించినా . . . 
 దాన్ని మీ మనసుకే పరిమితం చేసుకోకూడదు . నలుగు రికీ చెప్పే ప్రయత్నం చేయాలి . కొందరు దాన్ని ప్రచారం అనుకోవచ్చు కానీ అది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది . 

Popular Posts