తగ్గాలంటే కదలాలి! ( How to weigh loss in telugu )


బరువు తగ్గాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం . కానీ ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియదు . అలాంటప్పుడు ఈ సూత్రాలతో ప్రారంభించొచ్చు . బరువు తగ్గాలనుకున్న వారు కొవ్వు పదార్థాలతోపాటూ పిండిపదార్థాలను పరిమితంగా తీసుకోవాలి . వీటితో పాటు కూరగాయలు , తృణధాన్యాల తీసుకుంటే మేలు . వీటివల్ల పీచు శరీరానికి శక్తి అందుతాయి . # వ్యాయామం అనగానే ఓ గంట నడవడం లేదా ట్రెడ్ మిల్ పై పరుగులు పెట్టడానికే పరిమితం అవ్వొద్దు . కుదిరినప్పుడల్లా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి . అంటే టీవీ చూస్తున్నా , వంట చేస్తున్నా . . . కూడా మీ శరీరాన్ని కదిల్చే చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు . # ఆఫీసులో , ఇంట్లో గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది . అందుకే కనీసం అరగంటకోసారైనా ఓ ఇరవై అడుగులు అటూ - ఇటూ వేసి రండి . ఫోన్లో పీడో మీటర్ లేదా . స్టెప్ కౌంటర్ యాప్ వేసుకుంటే మీరు వేసిన ప్రతి అడుగూ లెక్కించగలుగుతారు .

Popular Posts